ELR: పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పనులను పూర్తి చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో జీయర్ మనోజ్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలానికి పదివేల మొక్కలు వస్తున్నాయని, వాటిని గ్రామాల వారీగా పంపిణీ చేసి సంరక్షించాలన్నారు.