NTR: జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరి దేవస్థానం ఆదివారం సాయంత్రం నుంచి చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడింది. స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. గిరిప్రదక్షిణ సహా ఇతర ఆరాధనలు కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.