W.G: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతమైందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 632 దరఖాస్తులు అందగా, అందులో 235 పరిష్కరించామని, 114 దరఖాస్తులను నిబంధనల మేరకు తిరస్కరించామని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 283 దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.