WG: గత 4రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెనుగొండ పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ సర్కిల్, ఎస్వీకేపీ, శిరిడి సాయిబాబా టెంపుల్, రామినీడి వారి పాఠశాల ముందు, పెద్ద వంతెన ప్రక్క రోడ్లలో భారీ స్థాయిలో వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.