SKLM: రణస్థలం మండలం నెలివాడ జంక్షన్ నుంచి చిల్లపేట రాజాం పంచాయతీ వరకు రూ.2.75 కోట్ల రూపాయల నిధులతో తారు రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును గ్రామ ప్రజలు, కూటమి నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.