VZM: రామభద్రపురం మండలం మిర్తివలసకు చెందిన చిన్నారి అశ్విని కన్నుకు పెన్సిల్ తగలడంతో గాయమైంది. కంటి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బేబినాయనకు చెప్పడంతో కంటి ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం చేశారు. నగదును కుటుంబ సభ్యులకు టీడీపీ నాయకులు అందించారు.