ATP: హంద్రీనీవా సుజల స్రవంతి అభివృద్ధి పనులపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎవరి హయాంలో ఎంతవరకు పనులు జరిగాయో చర్చించడానికి సిద్ధమని తెలిపారు. అదేవిధంగా జరిగిన పనుల్లో అవినీతి గురించి చర్చిద్దామని తెలిపారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కోరిక మేరకు బుధవారం బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు.