TPT: చంద్రగిరి మండల పరిధిలోని నారావారిపల్లిలో శుక్రవారం పాడి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. రైతులకు పశువులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ఉచితంగా పశువుల దాణా, వివిధ రకాల మందులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.