ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలంలోని వెంగలాయపల్లి గ్రామంలో పంచలింగాల కొండపై వెలసి ఉన్న శివాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు శివయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే మహిళలు శివాలయానికి చేరుకుని కార్తీకదీపం వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.