ATP: ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. రెండో రోజు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకుల నుంచి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.