VZM: ఆన్లైన్, ఆఫ్ లైన్ క్రికెట్ బెట్టింగులు పాల్పడడం, పాల్గొనడం, ప్రోత్సహించడం చట్టరీత్య నేరం అని బొబ్బిలి గ్రామీణ సీఐ ఎస్.శ్రీనివాస్ సూచించారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు తెరుస్తామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే డయల్ 100/ 112 కు ఫోన్ లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.