NLR: జూన్ 10న గురుపౌర్ణమి సందర్భంగా రాపూరు బస్ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు డిపో అధికారులు మంగళవారం తెలియజేశారు. రాను పోను టిక్కెట్ ధర 1,300 రూపాయలు అని చెప్పారు. రాపూరు, డక్కిలి, కలువాయి, పొదలకూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు.