ELR: వినాయక నిమజ్జనం సందర్భంగా కైకలూరులో గత రాత్రి దళిత యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సీపీఎం జిల్లా నాయకులు అన్నారు. ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న దళిత యువకులను సీపీఎం నాయకులు బృందం పరామర్శించింది. దాడికి గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు.