CTR: కుప్పం ఆర్డీవో కార్యాలయంలో PCPNDT చట్టం అమలుపై RDO శ్రీనివాసరాజు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్య నేరమన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHA గంగాదేవి, తదితర అధికారులు పాల్గొన్నారు.