NTR: ఇటీవల కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ జరిగిన అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని ఏకత్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. 61 కేజీల విభాగంలో కే వర్ధన్ సాయి రజత పతకం, 30 కేజీల విభాగంలో పి. జయ రేణుక, ఎం. లక్ష్మి సహస్ర, వి. యశస్విని కాంశ్య పతకాలు సాధించారు.