VZM: చంద్రగ్రహణం నేపథ్యంలో రామతీర్థంలోని రామస్వామి దేవస్థానాన్ని రేపు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం రాత్రి 9.50 గంటల గంటలకు చంద్రగ్రహణం పట్టనున్న నేపథ్యంలో ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. సోమవారం బాలభోగం నివేదన అనంతరం ఉదయం 11.30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు.