ELR: జిల్లా వ్యాప్తంగా ఇటీవలే జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రలకు అలాగే పలు ప్రాంతాలు సందర్శనలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకొని వారి కదలికలను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.