అన్నమయ్య: మదనపల్లెలో దొంగ ఓట్ల రాజకీయానికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు “ఓట్ చోర్ ఘద్దీ చోడ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సాయి సంపత్ నేతృత్వంలో, ఆదివారం స్థానిక హెడ్ పోస్టాఫీస్ ద్వారా రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణంలోని ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.