AKP: పరవాడ మండల పరిషత్, లంకెలపాలెం జంక్షన్లలో శిథిలమైన రోడ్లను కొత్తగా నిర్మించాలని CITU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పరవాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అధికలోడుతో వెళుతున్న బొగ్గు లారీలు కారణంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్లపై ఏర్పడిన పెద్దపెద్ద గోతుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.