MLG: వెంకటాపురం మండలం సుడిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ (27)కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి పొలం వైపు వెళ్తుండగా జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.