ATP: ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్ష జరగనుంది. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.