అన్నమయ్య: మదనపల్లె రూరల్ మండలం పెంచుపాడు, కోటవారిపల్లి, మాలేపాడు గ్రామాలకు చెందిన నలుగురు బాధితులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా (CMRF) కింద సుమారు రూ. 2 లక్షల విలువైన చెక్కులను మంగళవారం అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.