సత్యసాయి: సోమందేపల్లి మండలం వాల్మీకి సర్కిల్లో సీసీ కెమెరాలు సంబంధించిన వైర్లు మంగళవారం రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రోడ్డులో ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, స్పందించి ప్రమాదాలు జరగముందే వైర్లను రోడ్డుపై నుంచి వెంటనే తొలగించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.