ATP: గార్లదిన్నెలో రేపు మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని టీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తామని అన్నారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.