SKLM: కవిటి మండలానికి చెందిన పూడి హరి ప్రసాద్(ఐఆర్ ఎఎస్) విశాఖ రైల్వే జోన్‌కు ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సలహాదారుగా నిన్న బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ సివిల్ సర్వీస్‌లో ఉత్తీర్ణ సాధించిన ఆయన రైల్వే, విద్యుత్, దేశ రక్షణ విభాగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. దీంతో కవిటి మండలానికి చెందిన వాసులు హర్షం వ్యక్తం చేశారు.