TPT: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఘనంగా జరుగనున్నాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాల నేపథ్యంలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ముఖ్యంగా మార్చి 31న అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.