SKLM: రణస్థలం మండలం కోటపాలెం పెద్ద శేరి వద్ద వెలిసిన శ్రీ భద్ర మహంకాళీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు నరేశ్ స్వామి నేతృత్వంలో అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామాలతో విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు. పసుపు, కుంకుమ చీరలు సమర్పించి వారి మొక్కులు చెల్లించుకున్నారు.