ASR: రాజవొమ్మంగిలో ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఉపాధి APO రెడ్డిబాబు శుక్రవారం తెలిపారు. టెన్త్ ఆపై చదివిన, 18 -35 లోపు వయసు కలిగిన యువతీ యువకులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ఉపాధి పనులు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.