VZM: జిల్లా రెవెన్యూ డివిజనల్ అదికారి ( DRDO) ఎం.సుధారాణి శుక్రవారం రేగిడి ఆముదాలవలస మండలంలోని MLS రైస్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని స్టాక్ నిల్వల పరిస్థితి, నిల్వ విధానాలు, రికార్డుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియ, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. తూనికలు, కొలతల పరికరాలను తనిఖీ చేసి వాటి కచ్చితత్వాన్ని నిర్ధారించారు.