VZM: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చోక్కాకుల అప్పారావు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. అలాగే సంక్షేమ పథకాలను అర్హులైన కార్యకర్తలకు వర్తింపజేయాలని ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. దానితో పాటు నామినేటెడ్ పోస్టులలో పార్టీ శ్రేణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.