SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాలకు సంబంధించి పన్ను మొత్తాన్ని ఏకకాలంలో చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ బుధవారం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడినట్లు వివరించారు. ఈ నెలాఖరులోగా ఏకకాలంలో పన్ను బకాయిలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని తెలిపారు.