KDP: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నివాస కార్యాలయంలో శనివారం వైసీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. అంజాద్ భాష మాట్లాడుతూ.. ఈనెల 9న వైసీపీ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, రైతుల కొరకు చేస్తున్న ర్యాలీకి భారీగా రైతులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ స్థానిక వైసీపీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహిస్తామన్నారు.