కోనసీమ: మామిడికుదురు మండలంలోని పాసర్లపూడి బ్రిడ్జి వద్ద రూ. 8.82 కోట్లతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం పీ. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్పర్సన్ పెనుమాల లక్ష్మి, నాయకులు జేఎస్ఆర్, అడబాల తాతకాపు పాల్గొన్నారు.