SKLM: హెల్మెట్ ధారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కాశీబుగ్గ పట్టణంలో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ టి భవాని మూడు రోడ్లు కూడలి వద్ద అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించి వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ప్రజలంతా హెల్మెట్ ధారణను అలవాటు చేసుకుని, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు.