W.G: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నరసాపురం డీఎల్పీఓ వై. జ్యోతిర్మయి మంగళవారం ఆచంటలోని మొండి బకాయిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి హెచ్చరించారు. డివిజన్ లక్ష్యం రూ.12.34 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 9.03 కోట్లు వసూలు చేశామని.. మిగిలిన రూ.3.30 కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.