W.G: తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇటీవల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో MPP శేషులత ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. MPP లేకుండానే సమావేశం నిర్వహిస్తారా అన్న మీమాంస నెలకొంది.