NDL: రుద్రవరం (మం) కొండమాయపల్లెలోని చిన్నరాజు చెరువు నీరు వృథాగా పోతోంది. చేపల వేట కోసం కొందరు మత్స్యకారులు తూము ఎత్తడంతో నీరంతా వీధుల్లో ప్రవహిస్తోంది. వేసవిలో పశువులకు తాగడానికి కూడా నీరు లేకుండా పోతోందని సోమవారం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి వృథాను అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.