అన్నమయ్య: రాజంపేట మండలం కూచువారిపల్లి గ్రామస్తులు ఆదివారం టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజును ఘనంగా సత్కరించారు. ఈ మేరకు గ్రామంలోని మహిళలు, స్థానికులు కూటమి ప్రభుత్వం పథకాలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం చమర్తి ప్రతి గ్రామాన్ని, నాయకుడిని, కార్యకర్తను సొంత కుటుంబసభ్యుల్లా భావిస్తానని హామీ ఇచ్చారు.