ఎన్టీఆర్: విజయవాడ 33వ డివిజన్లో నూతన వాటర్ ప్లాంట్ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రారంభించారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్. రాజు పర్యవేక్షణలో శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అతిధులుగా హాజరయ్యారు.