VSP: నీటి ఛార్జీలు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నార్త్ జోన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ 53వ వార్డు పరిధి మర్రిపాలెం మహారాణి వీధిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మొండి బకాయిదారుల మంచి నీటి కొళాయి కనెక్షన్ను శుక్రవారం తొలగించారు. పెండింగ్లో ఉన్న ఈ పన్నులను తక్షణం చెల్లించాలని, లేని పక్షంలో శాఖ పరమైన చర్యలు చేపడతామన్నారు.