PLD: పెదకూరపాడు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు నుంచి మిర్చి కోతల కోసం వలస వచ్చిన కూలీ ఎల్లప్ప.. టాటా ఏసీ వాహనం నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య అంబమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.