ప్రకాశం: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని కొమరోలు ఎస్సై నాగరాజు ద్విచక్ర వాహనదారులతో అన్నారు. బుధవారం కొమరోలు పట్టణ సమీపంలోని అమరావతి కడప రాష్ట్ర రహదారిపై వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపితే రూ. 1000 జరిమానా విధిస్తామన్నారు.