VSP: సింహాచలం నుంచి సోంఠ్యం వెళ్లే రహదారిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ రోడ్డుపై తీవ్ర గాయాల పాలైంది. అటుగా వెళుతున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఈ విషయం తెసుకొని చూసి తన వాహనాన్ని ఆపారు. ప్రమాద వివరాలు తెలుసుకొని మహిళను తక్షణమే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.