ATP: మత్స్యకారుల ఆదాయం పెంచి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుత్తి పట్టణ శివారులోని చెరువు వద్ద మత్స్య సహకార సంఘ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుత్తి మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో 36,100 చేప పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదిలారు.