కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ కొనకళ్ళ నారాయణరావు సోమవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తెలుగు ప్రజల కోసం పరితపించే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయని, అమరావతిలో క్వాంటం వ్యాలీకి రూపకల్పన చేసిన దార్శనికత ఆయన సొంతమని తెలిపారు.