CTR: వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉభయ దాతలుగా బోడి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ధర్మకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.