E.G: ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సోమవారం కొవ్వూరులో ఆటో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుందర బాబు మాట్లాడుతూ… కార్మికులు ప్రాణత్యాగాలు చేసి పొందిన 28 చట్టాలను కాలరాస్తూ కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె లో కార్మికులంతా పాల్గొన్ని హక్కులను సాధించుకోవాలన్నారు.