TPT: నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.