KRNL: కోసిగి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్కు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం AISF జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేశ్, మండల కార్యదర్శి అంజి పనులను పరిశీలించారు. రోడ్డు నాణ్యత పాటించాలని, లోపాలు ఉంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.