PPM: కురుపాం ఆదర్శ పాఠశాలలో 2026-27 సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ రామలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 30వ తేదీ లోపు సంబంధిత పాఠశాల వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అలాగే ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని విద్యార్థులకు సూచించారు.